Sunday, January 5, 2025

సైబర్ నేరస్థుల చేతిలో చిక్కి… దొంగగా మారిన మహిళ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్‌లైన్‌లో మోసపోయిన ఓ మహిళ అత్తామామల బంగారు ఆభరణాలు చోరీ చేసిన సంఘటన మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చోరీ చేసిన ముగ్గురు నిందితులను మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 56.570 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ఉస్మాన్‌పుర, కట్టెలగూడకు చెందిన ఫరీదా బేగం, మహ్మద్ సమీర్, ఫర్‌హీన్ బేగం కలిసి బంగారు ఆభరణాలు చోరీ చేశారు.

ఫరీదాబేగం తను దాచుకున్న డబ్బులతో ఐదు నెలల క్రితం ఆన్‌లైన్‌లో పేపర్ కటింగ్ మిషన్ కొనుగోలు చేసింది. కానీ విక్రయదారుడు డబ్బులు తీసుకున్నాడు, మిషన్‌ను పంపించలేదు. మరిన్ని డబ్బులు పంపించాలని వారు కోరుతున్నారు. మిషన్ కొనుగోలు విషయం తెలిన ఆమె భర్త జహూర్ హుస్సేన్ మిషన్ వచ్చిందా లేదా అని పలుమార్లు అడుగుతున్నాడు. అసలు విషయం ఫరీదా బేగం భర్తకు చెప్పలేదు. అంతేకాకుండా మహిళ భర్తకు తెలియకుండా ఆమె ఆభరణాలను విక్రయించింది. ఆభరణాలు విక్రయించగా వచ్చిన డబ్బులను మిషనరీ విక్రేతలకు పంపించింది.

అయినా కూడా సైబర్ నేరస్థులు మిషన్‌ను పంపించలేదు. ఈ క్రమంలోనే బాధితురాలు ఆన్‌లైన్‌లో రూ.30,000 రుణం తీసుకుని ఇంటిని రినోవేట్ చేయించింది. ఈ విషయాలు అన్నీ భర్తకు తెలియకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడింది. అప్పుడే తన ఇంట్లో ఉంటున్న అత్తామామల బంగారు ఆభరణాలు చోరీ చేయాలని ప్లాన్ వేసింది. వాటిని విక్రయించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని చూసింది. దానికి మిగతా ఇద్దరి సహకారం తీసుకుని చోరీ చేసింది. నిందితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌చౌక్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ ఆనంద్, డిఐ దిలీప్‌కుమార్, డిఎస్సై శ్రీశైలం తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News