- Advertisement -
కొలంబో : శ్రీలంకలో బురఖాపై నిషేధం విధించనున్నారు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక ప్రజా భద్రతా వ్యవహారాల మంత్రి సరత్ వీరశేఖర విలేకరుల సమావేశంలో తెలిపారు. బురఖా ధరించడం తీవ్రవాదానికి సంకేతం అని, నిషేధ సంబంధిత పత్రాలపై తాను సంతకం చేశానని , కేబినెట్ ఆమోదానికి పంపించినట్లు చెప్పారు. దేశంలోని వేయికి పైగా ఇస్లామిక్ స్కూళ్ల (మదర్సాలు) మూసివేత కూడా ఉంటుందని చెప్పారు. ఈ అంశాలతో దేశంలోని ముస్లిం మైనార్టీలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. జాతీయ భద్రతా విషయాల కోణంలో అన్ని విషయాలను ఆలోచించుకుని ముస్లిం మహిళలు బురఖా వేసుకునే పద్థతిని నిషేధించనున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేదని, తీవ్రవాద ఉగ్రవాద సూచికలు ఎక్కడున్నా వాటి ఆటకట్టు తప్పదని లంక మంత్రి స్పష్టం చేశారు.
- Advertisement -