Tuesday, January 7, 2025

సిఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బుర్రా వెంకటేశం

- Advertisement -
- Advertisement -

టిజిపిఎస్‌సి చైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన బుర్రా వెంకటేశం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎంకు ఆయన పూల బొకేను అందజేయగా, బుర్రా వెంకటేశంకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. కాగా, టిజిపిఎస్‌సి చైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియామక ఫైల్‌పై గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సంతకం చేశారు.

ఈ నేపథ్యంలో బుర్రా వెంకటేశంను టిజిపిఎస్‌సి చైర్మన్‌గా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదా ఉన్న బుర్రా వెంకటేశంకు ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(స్పెషల్ సిఎస్)గా పదోన్నతి కల్పిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుర్రా వెంకటేశం కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆరేళ్ల పాటు లేదా ఆయనకు 62 ఏళ్లు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News