Friday, December 20, 2024

కాలుపై ఆర్‌టిసి బస్సు.. విలవిలలాడుతూ మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి న్యూస్: బైక్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టిన అనంతరం మహిళ కాలుపై టైరు 30 నిమిషాలు ఉండడంతో నరకం అనుభవిస్తూ ఆమె మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బేతంచెర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గొల్ల మద్దులేటి-గోవిందమ్మ అనే దంపతులు బైక్‌పై పట్టణంలోకి వెళ్లుండగా ఆర్‌టిసి బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు టైర్లు కాలుపై ఎక్కడంతో గోవిందమ్మ తీవ్రంగా గాయపడింది. ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ పారిపోవడంతో ఆమెపై బస్సు టైర్లు అర్థగంట పాటు ఉండడంతో ఆమె విలవిలలాడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్ప్రత్రికి తరలించినప్పటికి చనిపోయింది. అర గంట సేపు బస్సు టైరు తన భార్య తొడపై ఉండడంతో చనిపోయిందని భర్త మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు సి బెళగాల్ మండల కృష్ణందొడ్డికి చెందిన ఆమెగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News