Thursday, January 23, 2025

ఇటలీలో ఉక్రెయిన్ల బస్సు బోల్తా

- Advertisement -
- Advertisement -

Ukrainians bus overturned

రోమ్: రష్యా దాడి నేపథ్యంలో లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగుదేశాలకు పారిపోతున్నారు. ఇప్పటికే 20 లక్షల మందికిపైగా అలా స్వదేశం విడిచిపోయారని ఐక్యరాజ్యసమితి ఇటీవల వెల్లడించింది. యుద్ధం మొదలయినప్పటి నుంచి ప్రతిరోజూ వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 50 మంది ఉక్రెయిన్లతో వెళుతున్న బస్సు ఇటలీలో బోల్తా పడింది. సెసెనారిమిని మధ్య హైవేలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News