- Advertisement -
సోన్: నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం బస్సు దగ్ధం అయింది. ప్రైవేట్ బస్సు ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్ ప్రయాణికులను కిందికి దింపాడు. డ్రైవర్ అప్రమత్తవడంతో 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో ఎల్ హెచ్ ఏటీ 9966 బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ప్రమాద సమయంలో బస్సు నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని చెబుతున్నారు. మంటల్లో ప్రయాణికుల లగేజీ దగ్ధమైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు
- Advertisement -