Tuesday, January 21, 2025

మునగాలలో స్కూటీని ఢీకొట్టిన బస్సు… దగ్ధం…

- Advertisement -
- Advertisement -

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయాడని తెలిపారు. మృతుడు మురుగేష్ రాజుగా(48) గుర్తించారు. దీంతో స్కూటీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News