Thursday, December 26, 2024

బ్రేకులు ఫెయిల్…. కొండను ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ కు హ్యాట్సాఫ్

- Advertisement -
- Advertisement -

సీతారామారాజు న్యూస్: బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ తన వాహనాన్ని కొండను ఢీకొట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీతారామారాజు జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడ డిపోకు చెందిన బస్సు భద్రాచలం నుంచి కాకినాడకు వెళ్తుండగా వాలమూరు సమీపంలో బస్సు బ్రేకులు పని చేయడంలేదు. దీంతో డ్రైవర్ వెంటనే సమయస్ఫూర్తితో కొండను ఢీకొట్టడంతో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ కాళ్లు అందులో ఇరుక్కుపోయాయి. లారీతో బస్సును వెనక్కి లాగి డ్రైవర్‌ను బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సమయస్ఫూర్తికి అందరూ అభినందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News