Sunday, January 19, 2025

చెట్టును ఢీకొట్టిన బస్సు: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని ప్రచువాప్ ఖిరీ ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అతివేగంగా వెళ్లి చెట్టుకు ఢీకొట్టడంతో 14 మంది మృతి చెందగా 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందా లేక అతివేగమే ప్రమాదానికి కారణామా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు ముందు భాగం ధ్వంసమైందని వెల్లడించారు.  ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News