Tuesday, March 11, 2025

బస్సు లారీ ఢీ.. మహిళ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :  ఆర్టిసి బస్సు లారీ ఢీ కొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట,బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య మూల మలుపు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంగపేట మండలంలో బ్రాహ్మణపల్లి మూలమలుపు వద్ద రహదారి పై మంగపేట వైపు వస్తున్న ఆర్టిసి బస్స జానం పేట వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ముందు సీట్లో కూర్చన్న తేజస్విని అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News