Thursday, December 26, 2024

మథురలో కారు, బస్సు ఢీ : ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

నోయిడా : ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఒక బస్సును ఢీకొని కారు అగ్ని జ్వాలల్లో చిక్కుకోగా ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారని పోలీసులు వెల్లడించారు. మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్స్‌ప్రెస్‌వే ఆగ్రా=నోయిడా క్యారేజ్‌వేపై 117వ మైలురాయి సమీపంలో ఈ ప్రమాదం సంభవించిందని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కారు ఢిల్లీ వెళుతుండగా ఈ ప్రమాదానికి గురైంది. బస్సులోని ప్రయాణికులు ఎవ్వరూ గాయపడలేదు. వారిని వేర్వేరు వాహనాల్లో వారి గమ్యస్థానాలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

‘బస్సు, స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. బస్సు టైర్ ఒకటి పేలిపోగా బస్సు అదుపు తప్పి రోడ్డుపైకి మళ్లిందని మా దృష్టికి వచ్చింది. వెనుక నుంచి వస్తున్న స్విఫ్ట్ కారు బస్సును ఢీకొన్నది. రెందు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి’ అని మథుర పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) శైలేష్ పాండే వివరించారు. బస్సు ప్రయాణికులు బయట పడగలిగారు కానీ కారులోని వారు తప్పించుకోలేకపోయారని, ఆ ఐదుగురూ సజీవ దహనమయ్యారని పాండే తెలిపారు. ‘మృతులు అందరూ పురుషులే. వారు షికోహాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్నారు’ అని పాండే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News