Monday, December 23, 2024

ప్రయాణికురాలిని తీవ్రంగా కొట్టిన బస్సు కండక్టర్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఓ ప్రయాణికురాలిపై దాడి చేసి విచక్షణరహితంగా చావబాదిన ఓ బస్సు కండక్టర్ ని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (బిఎంటిసి) అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 17న మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది.

భన్నేర్ ఘట్ట నేషనల్ పార్క్ స్టాప్ లో బస్సు ఎక్కిన ఓ మహిళ శివాజీనగర్ వెళ్లేందుకు టికెట్ తీసుకుంది. టికెట్ ఇచ్చే సమయంలో కండక్టర్ తో జరిగిన వాగ్వాదంలో కండక్టర్ కోపం పట్టలేక ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటనను తోటి ప్రయాణికుడెవరో వీడియో తీసి, ఎక్స్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. బాధితురాలు కూడా వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై బిఎంటిఎస్ అధికారులు విచారణ జరిపి, హొన్నప్ప అగసర్ అనే ఆ కండక్టర్ ని సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News