Sunday, February 2, 2025

బస్సు కండక్టర్‌పై చెప్పుతో దాడి.. 300 నెంబర్ బస్సులో ఘటన

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్‌లో మహిళా ప్రయాణికురాలు రెచ్చిపోయింది. బస్సు కండక్టర్ పై చెప్పుతో దాడికి పాల్పడింది. అడిగిన చోట బస్సు ఆపలేదని ఆరోపిస్తూ కండక్టర్‌ను విచక్షణారహితంగా దుర్భాషలాడుతూ చెప్పుతో కొట్టింది. మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్లే 300 నెంబర్ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కండక్టర్‌ ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన మహిళ శివరాంపల్లికి చెందన ప్రసన్న గా గుర్తించారు. ఇప్పటికే మహిళలకు ఫ్రీబస్సు సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో మహిళలు కొట్టుకోవడం, డ్రైవర్, కండక్టర్ల వరస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News