బెంగళూరు: బస్సు ప్రయాణికుడికి కండక్టర్ ఒక రూపాయి చిల్లరను ఇవ్వనందుకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్(బిఎంటిసి)కు రూ. 3,000 జరిమానా విధిస్తూ బెంగళూరు జిల్లా వినియోగదారుల ఫిర్యాదుల పిరష్కార కమిషన్ తీర్పు ఇచచింది. పత్రికల కథనం ప్రకారం..రమేష్ నాయక్ అనే ప్రయాణికుడు 2019లో శాంతినగర్ నుంచి మెజిస్టిక్ బస్ డిపోకు బిఎంటిసి బస్సు ఎక్కాడు.
కండక్టర్ రూ. 29 టికెట్ ఇచ్చాడు. రమేష్ రూ. 30 ఇవ్వగా మిగిలిన ఒక రూపాయి చిల్లరను కండక్టర్ ఇవ్వలేదు. తనకు కండక్టర్ ఇవ్వాల్సిన ఒక రూపాయి చిల్లర కోసం రమేష్ బిఎంటిసి ఉన్నతాధికారులకు రమేష్ ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. పైపెచ్చు ఉన్నతాధికారులు హేళనగా మాట్లాడడంతోపాటు బలవంతంగా బయటకు పంపివేశారు. దీంతో ఆగ్రహించిన రమేష్ స్థానిక వినియోగదారుల కోర్టులో తనకు బిఎంటిసి ఉంచి రూ. 15,000 నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇటీవలే తీర్పు ఇస్తూ రమేష్‌కు రూ. 2,000 నష్టపరిహారంతోపాటు కోర్టు ఖర్చుల కింద రూ. 1,000 చెల్లించాలని బిఎంటిసిని ఆదేశించింది.