Friday, February 21, 2025

ఘోర రోడ్డు ప్రమాదం: 39 మంది మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బలూచిస్తాన్ లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలూచిస్తాన్ లోని క్వెట్టా నుంచి కరాచీ వెళ్తుండగా బస్సు లోయలో పడి పడింది. ఈ ఘటనలో 39 మంది సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులు 50 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, రిస్క్యూ సిబ్బంది సహయంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News