Friday, December 20, 2024

రోడ్డులున్నా.. బస్సు సౌకర్యాలు సున్నా

- Advertisement -
- Advertisement -

అమరచింత : వనపర్తి జిల్లాలో చివరి మండలమైన అమరచింత మండల కేంద్రానికి రోడ్ల సౌకర్యాలు ఉన్నప్పటికీ వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల నుండి బస్సు సౌకర్యాలు లేని దుస్థితి అమచింత మండల కేంద్రానికి ఏర్పడింది అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న రాజకీయ పార్టీలు అమరచింత పట్టణంలో ఉన్నాయి. రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మేధావులు ఉన్నప్పటికీ వారికి ఉన్న వాహనాలలో వారు ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. పేద ప్రజల బస్సు సౌకర్యాల విషయంలో చొరవ చూపకపోవడం బాధకరమని అంటున్నారు. పేద ప్రజల బస్సు సౌకర్యం విషయంలో పాలకులు ప్రజాప్రతినిధులు నిర్లక్షం వీడి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. బస్సు సౌకర్యాలు లేక ప్రజలు విద్యార్థులు వ్యాపారవేత్తలు ఇబ్బందుల పాలై ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారన్నారు.

అమరచింత పట్టణంలో ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రైవేటు వాహనాలు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. బస్సు సౌకర్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు బస్సు సౌకర్యాలు మెండుగా ఉండేవి మహబూబ్‌నగర్ డిపోకు చెందిన బస్సులు పరిగి డిపోకు చెందిన బస్సులు షాద్‌నగర్ డిపోకు చెందిన బస్సుల నడిచేవి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అమరచింత మండల కేంద్రంలో రహదారులు పెరిగాయి తప్ప బస్సు సౌకర్యాలు విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సంబంధిత అధికారులు విఫలమైనట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దృష్టికి ఎన్నో సార్లు లిఖితపూర్వకంగా ప్రత్యేకంగా విన్నవించుకున్న విఫలమయ్యాయని ప్రజాప్రతినిధులు తెలుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఎన్నో ఏళ్లు అవుతున్న బస్సు సౌకర్యాలు లేవు. ఒక్క గద్వాల డిపో బస్సులు అరకొర ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో సమయపాలన పాటించడం లేదు అని ప్రయాణికులు వాపోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News