Monday, December 23, 2024

బస్సు లోయలో పడి 21మంది మృతి

- Advertisement -
- Advertisement -

జమ్ము: జమ్ముకశ్మీర్ లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. జమ్ముపూంచ్ రహదారిపై బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 21 మంది మృతి చెందారని, 40 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. “ ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు, జమ్ము లోని అఖ్నూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జమ్ముపూంచ్ రహదారిపై అదుపు తప్పి 150 అడుగుల లోతు లోయలో పడిపోయింది” అని వెల్లడించారు.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతాయని చెప్పారు. గాయపడిన వారిని అఖ్నూర్ లోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ ఈ ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను ” అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News