భోపాల్ : మధ్యప్రదేశ్ లోని ఖర్‌గోస్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. శ్రీఖండి నుంచి ఇండోర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బ్రిడ్జిసై నుంచి నదిలో పడిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి నదిపై ఉన్న వంతెన రెయిలింగ్ ను ఢీకొనడంతో 50 అడుగుల కిందనున్న నది లోకి పడిపోయింది.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికులు ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాద స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలు పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.