- Advertisement -
ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని మ్హస్లా తహసీల్ సమీపంలో ఆదివారం 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు, అనేకమంది గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రాయ్‌ఘడ్‌లోని ఘోన్సే గ్రామంలో బస్సు 50-60 అడుగుల లోయలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు శ్రీవర్ధన్ గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు థానే నుంచి వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
- Advertisement -