ముంబై: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలో పాత ముంబైపూణే హైవే పై శనివారం తెల్లవారు జామున సంప్రదాయ సంగీత బృందానికి చెందిన యువతీయువకులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోయింది. ఐదుగురు మైనర్లతో సహా 13 మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు.
Also Read: కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టులకు అబద్ధాలు చెబుతున్నాయి: కేజ్రీవాల్
పుణే నుంచి ముంబైకి 42 మందితో వెళుతున్న ప్రైవేట్ బస్సు బోర్ ఘాట్ మౌంటెయిన్ బైపాస్ వద్ద 300 అడుగుల లోయలో పడిపోయింది. ఆ ఘాట్ ‘ఖాండ్ల ఘాట్’ గా ప్రసిద్ధి. ఈ దుర్ఘటన శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు ఖోపోలి పట్టణం వద్ద సంభవించింది. ఇది ముంబైకి 70 కిమీ. దూరంలో ఉంటుందని పోలీసు అధికారి తెలిపారు.
Also Read: దక్షిణాది ప్రతిఘటనతో దిగొచ్చిన కేంద్రం!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మృతులు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించారు. గాయపడిన ఐదుగురి పరిస్థితి సున్నితంగా ఉందని ఆయన అన్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శోకాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ముఖ్యమంత్రి షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడారు. దుర్ఘటన గురించి తెలియగానే స్థానిక పోలీసుల బృందం, యశ్వంతి హైకర్స్ వాలంటీర్ల బృందం ఖోపోలికి వెళ్లింది. రెస్కూ ఆపరేషన్ చేపట్టారు.