Sunday, December 22, 2024

చెరువులో బోల్తాపడిన బస్సు: 17 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఝలకతి సదర్ ఉప జిల్లా ఛత్రకాండ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో 17 మంది మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారుగా 70 ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. డ్రైవర్ నిర్లక్షంతో పాటు బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. బస్సు ఝులకతి నుంచి బంఢారియలోని ఫిరోజ్‌పూర్‌కు వెళ్తుండగా బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోకు సైడ్ ఇవ్వడంతో బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి బోల్తాపడింది. పోలీసులు, ప్రభుత్వాధికారులు, స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు సుమియా(6), తెరక్, ఎండి(45) సలామ్(60), ఎండి మహిన్(25), అబ్దుల్లా(08), రహిమా(60), అబుల్ కలామ్(35), రిపామోని(02), అయిరిన్(22), నోయాన్(16), ఖుష్బు(19), ఖడిజా(55)గా గుర్తించామని ఝలకతి సదర్ ఉప జిల్లా ఎస్ పి అఫ్రుజుల్ హకూ తూతుల్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News