Wednesday, January 22, 2025

లోయలో పడిన బస్సు 25 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లిమా: దక్షిణా అమెరికాలోని పెరూ దేశంలో సోమవార అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 200 మీటర్ల లోతు లోయలో బస్సు అదుపుతప్పి పడడంతో 25 మంది మృతి చెందగా 34 మంది తీవ్రంగా గాయపడ్డారని రక్షణ శాఖ మంత్రి జోర్జ్ చావేజ్ తెలిపాడు. బస్సు అండీన్ టౌన్ నుంచి హౌనకావేలికా ప్రాంతానికి వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెస్కూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇదే ప్రదేశంలో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా 13 మంది మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెరూవైన్ జాతీయ రహదార్లపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, అతివేగం, రహదారి దెబ్బతినడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News