Thursday, January 23, 2025

బస్సు ఛార్జీ డబ్బులు ఇవ్వలేదని… యువకుడి ప్రాణాలు తీశారు…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఛార్జీలు డబ్బులు ఇవ్వలేదని ప్రయాణికుడిని వాహనంలో నుంచి డ్రైవర్, క్లీనర్ నెట్టెయడంతో యువకుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గేదేల భరత్ కుమార్ (27) అనే యువకుడు విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. వేడుక ఉండడంతో తన స్నేహితులతో కలిసి శ్రీకాకుళానికి వచ్చాడు. అత్యవసరంగా ఇంటి దగ్గర పని పడడంతో స్నేహితులకు వెళ్తునని చెప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు ఛార్జీలు ఇవ్వమని డ్రైవర్ రామకృష్ణ, క్లీనర్ అప్పన్న అడగడంతో తన స్నేహితులు ఫోన్ పే చేస్తారని చెప్పారు.

Also Read: గుజరాత్‌దే గెలుపు

ఎంత సేపటికి డబ్బులు రాకపోవడంతో పాటు స్నేహితులు ఫోన్ స్విచ్ఛాప్ అయింది. విశాఖపట్నం వెళ్లిన తరువాత ఇస్తానని డ్రైవర్, క్లీనర్‌ను బతిమాలాడు. భరత్‌కు డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ జరిగింది. వెంటనే బస్సు నుంచి భరత్‌ను బయటకు నెట్టెయడంతో డివైడర్ మీద అతడు పడడంతో తల బలమైన గాయమైంది. హైవే పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా దుర్మరణం చెందాడు. సిసి టివి ఫుటేజీ పరిశీలించి డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే నెట్టేశామని ఒప్పుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News