శ్రీనగర్: జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో బుధవారం ప్రయాణీకుల బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు గుర్తించారు. JK02CN-6555 అనే రిజిస్ట్రేషన్ నంబర్ గల బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారని, అది బటోట్-కిష్త్వార్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో రోడ్డుపై నుంచి జారిపడి 300 అడుగుల దిగువకు పడిపోయిందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు. “దోడాలోని అస్సర్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధిత వ్యక్తులకు అవసరమైన అన్ని సహాయాన్ని అందించాల్సిందిగా డివికామ్, డిస్ట్రిక్ట్ అడ్మిన్‌ను ఆదేశించింది” అని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు.