- Advertisement -
ఛండీగఢ్: పంజాబ్‌లోని భటిండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు తల్వాండి సాబో నుంచి భటిండాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షం రావడంతో బస్సు వేగంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నారు.
- Advertisement -