Wednesday, January 22, 2025

లోయలో పడిన బస్సు: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ములోని అఖ్నూర్ ప్రాంతంలోని చంగి మోర్ ప్రాంతంలో గురువారం ఉదయం బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. పోలీసులు, ప్రభుత్వాధికారులు ఘటనా స్థలానికి క్షతగాత్రులను అఖ్నూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో జమ్ములోని జిఎంసి ఆస్పత్రికి తరలించారు. యాత్రికుడు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News