Tuesday, January 21, 2025

అడ్డాకులలో వ్యక్తిపై పడిన బస్సు

- Advertisement -
- Advertisement -

అడ్డాకుల: మహబూబ్ నగర్ జిల్లాలో అడ్డాకులలో మండలంలో శనివారం ఉదయం బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పివై 04ఎ 2518 అనే నంబర్ గల బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా అడ్డాకుల గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తాపడింది. ఓ వ్యక్తి బహిర్భూమికి వెళ్తుండగా అతడిపై బస్సు పడడంతో ఘటనా స్థలంలో చనిపోయాడు. మృతుడు కృష్ణయ్య(52)గా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన డ్రైవర్ వెంకటేశ్, కుమార్, శ్యామ్ కుమార్, కిరణ్‌లను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు క్రేన్ సహాయంతో అక్కడికి చేరుకొని బస్సును పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News