Sunday, December 22, 2024

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు అదుప్పతప్పి బ్రిడ్జి నుంచి రైల్వే ట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 28మందికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని దవాఖానాకు తరలించారు.30మంది ప్రయాణికులతో బస్సు.. హరిద్వార్ నుంచి ఉదయ్ పూర్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News