Monday, January 20, 2025

యజమాని కొట్టాడని… బస్సులకు నిప్పంటించిన డ్రైవర్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ / కూకట్‌పల్లి : కూకట్‌పల్లిలోని ఐడిఎల్ చెరువు సమీపంలోగల ఓ గ్యారేజీలో ఆదివారం రాత్రి ౩ బస్సులు నిప్పంటుకుని కాలిబూడిదైన ఘటనతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో భాగంగా బస్సు కు ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్ట్టిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి ఏసిపి చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం భారతీ ట్రావల్స్ నిర్వాహకుడు కృష్ణారెడ్డి వద్ద డ్రెవర్‌గా పనిచేస్తున్న వీరబాబు అనే వ్యక్తి ఆదివారం విధులుకు వెళ్లాల్సిందిగా కృష్ణారెడ్డి ఆదేశించారు. వీరబాబు తాను వెళ్లనని నిరాకరించడంతో కృష్ణారెడ్డికి వీరబాబుకు గొడవ జరిగింది. ఇదే క్రమంలో కృష్ణారెడ్డి అతడి అన్న కొడుకు య శ్వంత్‌రెడ్డిలు వీరబాబును కొబ్బరిమట్టెలు, ప్యాన్ బెల్టు తో బాగా కొట్టడంతో వీరబాబు అక్కడి నుంచి పారిపోయాడు.

ఇదే మనులో పెట్టుకున్న వీరబాబు కృష్ణారెడ్డికి ఎలాగైన నష్టం కలిగించాలని నిర్ణయించుకుని అదేరోజు సాయంత్రం బాగా మధ్యం సేవించి స్ధానిక పెట్రోల్ బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకుని రాత్రి సమయంలో గ్యారేజీలో ప్రవేశించి బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటిచి అక్కడి నుండి తన స్వగ్రామం పారిపోయాడు. బస్సు కు మంటలు అంటుకుని పక్కనే ఉన్న మరో రెండు బస్సులు మంటల్లో చిక్కుకుని కాలిపోతున్న సమయంలో స్థ్ధానికుల సమాచారం మేరకు కూకట్‌పల్లి పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసి కేసు నమోదు చేసుకున్నారు. అయితే కృష్ణారెడ్డి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిసి ఫుటేజ్‌ల ఆధారంగా వీరబాబు ఉద్ధేశపూర్వకంగానే బస్సుకు నిప్పుపెట్టినట్లు గుర్తించి కృష్ణాజిల్లాలోని లక్ష్మీపురంలో వీరబాబును అదుపులోకి తీసుకుని విచారించగా తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే తనపై దాడి చేసిన కృష్ణారెడ్డి, యశ్వంత్‌రెడ్డిలపై వీరబాబు సైతం ఫిర్యాదు చేశాడు. ఇరువురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిఐ నర్సింగ్‌రావులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News