Sunday, December 22, 2024

వర్ధన్నపేటలో బైక్ ఢీకొట్టిన బస్సు… 50 మీటర్ల దూరంలో పడిన నాలుగు మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైక్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో నలుగురు యువకులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. అతివేగంగా వచ్చి రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో 50 మీటర్ల దూరంలో మృతదేహాలు పడిపోయాయి. ఇల్లందు గ్రామానికి చెందిన వరుణ్ తేజ్, సిద్దు, అనిల్ కుమార్, వర్ధన్నపేటకు చెందిన గణేశ్‌లు కలిసి ఒకే బైక్‌పై ఇల్లందు నుంచి వర్ధన్నపేటకు వెళ్తుండగా వారి వాహనాన్ని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రైవేటు బస్సు హనుమకొండ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గణేశ్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణుడు కావడంతో తన స్నేహితులకు దావత్ ఇచ్చి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు గ్రామాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News