Saturday, December 21, 2024

కామారెడ్డిలో లారీని ఢీకొట్టిన బస్సు

- Advertisement -
- Advertisement -

టేక్రియాల్: కామారెడ్డి జిల్లా టేక్రియాల్ శివారులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పది మంది స్వల్పంగా గాయపడినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసి బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. లారీని రోడ్డుపై నిలిపడంతో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టిసి రాజదాని బస్సు లారీని ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News