Tuesday, January 7, 2025

యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ సమీపంలో ఆగ్రా-లఖ్‌నవూ జాతీయ రహదారిపై ఓ బస్సు ట్రక్కును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు మృతి చెందారు. మరో 21మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యుల చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరువాలోని శ్రీ భీమ్‌రావ్ అంబేద్కర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. 40మంది ప్రయాణికులతో ఘోరక్ పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News