Tuesday, January 21, 2025

వీధి పిల్లల కోసం ‘బాలస్నేహి’ బస్సు..

- Advertisement -
- Advertisement -

థానే: వీధి పిల్లల చదువు, కౌన్సెలింగ్ సౌకర్యాలు కల్పించడానికి వీలుగా బాలస్నేహి అనే ప్రత్యేక బస్సును థానే జిల్లా కలెక్టర్ అశోక్ షింగారే ప్రారంభించారు. మహిళ, శిశు సంక్షేమ విభాగం చొరవతో ఏర్పాటైన ఈ బస్సును ఒక ఎన్‌జివొ నిర్వహిస్తుంది. ఇలాంటి బస్సులు పుణె, నాసిక్, ముంబైల్లో కూడా ప్రవేశ పెడతామని అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రతి బస్సులో ఒకే సారి 25 మంది పిల్లలను తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. ప్రతి బస్సులో కౌన్సెలర్, టీచర్లు, కేర్‌టేకర్ ఉంటారు. అలాగే ప్రతి బస్సును జిల్లాలో ఆరు చోట్లకు తీసుకెళ్లతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News