ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం ముల్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పాకిస్థాన్ రెస్కూ 1122 విభాగం అధికార ప్రతినిధి అందించిన వివరాల ప్రకారం లాహోర్ నుంచి కరాచీకి హైవేపై వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోడానికి ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంటలను అతి కష్టం మీద ఆర్పగా, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలిలంచారు. ఈ ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. పాకిస్థాన్‌లో శనివారం కూడా ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 13 మంది మరణించారు.
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -