Thursday, January 23, 2025

బోల్తా పడ్డ బస్సుపై ప్రయాణికులు..

- Advertisement -
- Advertisement -

అంబాలా : ఉత్తరాదిని గుక్కతిప్పుకోనివ్వనిరీతిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కుండపోత వానలు వరదల పరిస్థితి నడుమ సోమవారం హర్యానాలో బస్సు ప్రయాణికులు గంటల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. భారీ వర్షాల తాకిడికి గురైన హిమాచల్ ప్రదేశ్ నుంచి దాదాపు 27 మందితో బయలుదేరిన బస్సు అంబాలా యమునానగర్ రోడ్డు మధ్యలోకి వచ్చిన తరువాత వరదనీటిలో చిక్కుపడి నిలిచిపోయింది. వేగంతో దూసుకువచ్చిన వరదలతో ఈ బస్సు చెరువుగా మారిన ఈ రోడ్డు మీది వరదలో బోల్తాపడింది.

పరిస్థితిని గుర్తించి ప్రయాణికులు జాగ్రత్తగా బోల్తా పడ్డ బస్సు పై భాగానికి చేరారు. ఓ వైపు వరద పెరుగుతూ ఉండటంతో వీరికి క్షణక్షణం చావు భయాలు వెంటాడాయి. పరిస్థితి గురించి తెలియగానే అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, గంటల తరబడి శ్రమించి రోప్‌లు, క్రేన్లతో వీరిని బయటకు తీసుకువచ్చి కాపాడారు. బస్సు టాప్ నుంచి ప్రయాణికులు తాడులు పట్టుకుని వేలాడుతూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం, కొందరిని క్రేన్లలోకి చేర్చి రక్షించిన ఘట్టాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News