Monday, December 23, 2024

స్టీరింగ్ రాడ్ విరిగి బోల్తాపడిన బస్సు

- Advertisement -
- Advertisement -

కడప: ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. లక్షమ మంది ప్రయాణికులను సురక్షితంగా ఆర్‌టిసి బస్సులు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. లక్ష కిలో మీటర్లు పైన ప్రయాణించిన బస్సులను తొలిగించాల్సింది. కానీ బస్సులు లేకపోవడంతో కాలం చెల్లిన బస్సులను అధికారులు వాడుతున్నారు. దీంతో ఆ బస్సులే ప్రాయాణికులు ప్రాణాలు తీస్తున్నాయి. కడప జిల్లా కుప్పం ఆర్‌టిసి డిపోకు చెందిన బస్సు శనివారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కనుమూరు నుంచి వెళ్తుండగా దాని స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. బస్సు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News