Wednesday, January 22, 2025

బస్సు బోల్తా పడి మహిళ మృతి: 10 మందికి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

నల్గొండ జిల్లాలోని చింతపల్లి శివారులో శనివారం ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. చింతపల్లి వద్ద నాగర్జున సాగర్ రోడ్డుపై బస్సు బోల్తా పడింది. నిన్న వినుకొండలో పెళ్లికి వెళ్లిన బృందం తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తక్షణమే క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News