Wednesday, January 22, 2025

6న దివ్యాంగుల బస్‌పాస్ మేళా

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో ః గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్‌టిసి ఆధ్వర్యంలో ఈ నెల 6న దివ్యాంగుల బస్‌పాస్ మేళా నిర్వహించనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (ఈడి) ఎస్. కృష్ణకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉప్పల్ బస్టాండ్‌లోని బస్‌పాస్ కౌంటర్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గ్రేటర్‌లోని దివ్యాంగులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్‌పాస్ తీసుకోవాలనుకునే దివ్యాంగులు ఒక పాస్ పోర్టు సైజు ఫోటో,సదరం సర్టిఫికెట్ కాపీతోపాటు ఆధార్ కార్డు జిరాక్స్ ,ఐడీ కార్డును జతచేయాలన్నారు. అంతే కాకుండా సర్వీస్ చార్జ్ కింద రూ.50 చెల్లించి ఉప్పల్ బస్టాండ్‌లోని బస్‌పాస్ కౌంటర్‌లో చెల్లించి బస్‌పాస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News