Sunday, December 22, 2024

నదిలో పడిన బస్సు: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండు: నేపాల్ దేశం తనాహున్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి మర్సాయంగ్డి నదిలో పడిపోవడంతో 14 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన 16 మందిని ఆస్పత్రికి తరలించారు. 40 మంది ప్రయాణికులతో పొఖారా నుంచి ఖాట్మాండు వెళ్తుండగా బస్సు నదిలో పడింది. వెంటనే స్థానికులు స్పందించి 16 మందిని కాపాడారు.  45 మంది సిబ్బందితో జిల్లా ఎస్ పి మాధవ్ పౌడల్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు నంబర్( యుపి ఎఫ్ టి 7623) ఆధారంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. నేపాల్ లో జూన్‌ నెలలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి రెండు బస్సులపై పడడంతో ఆ వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 67 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News