Friday, December 20, 2024

మహబూబ్‌నగర్‌లో బోల్తాపడిన బస్సు: పది మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల శివారులో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడడంతో పది మంది గాయపడ్డారు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బోల్తాపడిన బస్సు పైకి లేపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News