Wednesday, January 22, 2025

తిరుపతిలో బోల్తా పడిన బస్సు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట వద్ద ప్రైవేటు బస్స బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు బళ్లారి నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. బ్రేక్ ఫేయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News