Wednesday, January 22, 2025

కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఎంజిబిఎస్, జెబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు జనాలతో నిండిపోయాయి. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఆర్టీసీ, రైల్వే శాఖ అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. ఆర్టీసీ పలు జిల్లాలకు శివారు ప్రాంతాల నుంచే బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

అటు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. జాతీయ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి. రహదారి విస్తరణ పనుల వల్ల నెమ్మదిగా వాహనాలు సాగుతున్నాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా పోతున్నాయి. అటు చౌటుప్పల్ వద్ద 2 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. వలిగొండ రోడ్డు నుంచి లక్కారం వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అండర్ పాస్ లేక వాహనదారులకు, స్థానిక ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News