Sunday, December 22, 2024

బస్సు షెల్టర్ ఇలా..ప్రయాణికులు సేద తీరేదెలా..!

- Advertisement -
- Advertisement -

దేవరకొండః   దేవరకొండ టూ శ్రీశైలం ప్రధాన రహదారిలోని డిండి మండలం ఖానాపురం గేటు వద్ద ఎస్‌జిఆర్‌వై నిధులతో బస్సు షెల్టర్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ ఈ మధ్య కాలంలో నిరుపయోగంగా మారిందనే చెప్పాలి. బస్సు షెల్టర్ ముందు  పిచ్చిమొక్కలు, తుమ్మకంప చేరి ప్రయాణికులు ఆ బస్సు షెల్టర్ నీడనా సేద తీరే వీలు లేకుండాపోయింది. బస్సు షెల్టర్ ఉన్నా అందులోకి వెళ్లలేక రోడ్డు పైననే నిల్చొవాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం వేసవికాలం.. ఎండలు దంచికొడుతున్న తరుణంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి బస్సు షెల్టర్ ముందున్న తుమ్మకంపను తొలగించి శుభ్రం చేస్తే ప్రయాణికులకు ప్రయోజకరం ఉంటుందని పలువురు ప్రజలు, ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా బస్సు షెల్టర్‌ను ప్రయాణికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News