Wednesday, January 22, 2025

టెంపోను ఢీకొట్టిన బస్సు…

- Advertisement -
- Advertisement -

దౌసా: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాదచారులతో పాటు రోడ్డుపై ఆగి ఉన్న టెంపోను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పాదచారులతో సహా టెంపోలోని మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలు కాగా ఒకరిని జైపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దౌసాలోని గాజీపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

కైలాదేవిని దర్శించుకున్న భక్తులు.. టెంపోలో హిందౌన్ నుంచి మహావాకు బయలుదేరారు. మార్గమధ్యంలో గాజీపూర్ సమీపంలో జాతీయ రహదారిపై టెంపో నిలిచిపోయింది. అదే సమయంలో మహావా నుంచి హిందౌన్ వైపు వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న టెంపోతో సహా పాదచారులపైకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News