Thursday, January 23, 2025

బస్సు టిక్కెట్లు అమ్మలేదని ఫ్లెక్సీపై ఫొటోలు ?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎవరైనా అత్యంత ప్రతిభ కనబరిస్తే ఫ్లెక్సీలో ఫొటోలు వేసి అభినందిస్తారు. కానీ, అందుకు భిన్నంగా టిక్కెట్లు అమ్మలేదని ఆర్టీసి అధికారులు ఫ్లెక్సీలపై సిబ్బంది ఫొటోలను ప్రచురించారు. ఈ సంఘటన ప్రస్తుతం ఆర్టీసిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మేడ్చల్ ఆర్టీసి డిపోలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయమై ఆర్టీసి ఉన్నతాధికారులు స్పందించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు అధికారులు వేధింపుల వల్లే సంస్థకు చెడ్డపేరు వస్తుందని ఉద్యోగులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి….
ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే…. టికెట్లు తక్కువ అమ్ముతున్నారంటూ మేడ్చల్ డిపో తరఫున అధికారులు సిబ్బంది పనితనం గురించి తెలిపే ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. టికెట్‌లు అమ్ముడుపోకపోయినా, కెఎంపిఎల్, ఎర్నింగ్ ఈపీకే రాకపోయినా అధికారుల నుంచి ఈ విధమైన వేధింపులు ఉంటున్నాయని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఆర్టీసి అధికారుల వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్యలు, మరికొందరు మనో వేదనకు గురై, విధులకు రావడం మానేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆర్టీసి యాజమాన్యం స్పందించి ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News