Tuesday, January 21, 2025

మెక్సికో బస్సు ప్రమాదం: మృతుల్లో ఆరుగురు భారతీయులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన బస్సు లోయలోపడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. నయారిట్ రాష్ట్రంలోని రాజధాని టెపిక్‌కు చాలా దూరంలో ఉన్న బరాన్కా బ్లాంకా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బస్సు 40 మంది ప్రయాణికులతో టిజువానాకు వెళ్తుండగా అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.

సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. బస్సు 50 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో సవాళ్లు ఎదురైనప్పటికీ, గాయపడిన ప్రయాణికులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. భారతీయ బాధితుల గుర్తింపును ప్రస్తుతానికి వెల్లడించలేదు. ప్రమాదానికి సంబంధించిన వాహనాన్ని నడిపే బాధ్యత కలిగిన బస్ సర్వీస్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News