Wednesday, January 22, 2025

మాజీ దేశాధ్యక్షుడి భార్య తినే ఆహారంలో టాయిలెట్ క్లీనర్!

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య బుష్రా బీబీపై జైలులో విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. తాము తోషఖానా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు ఇమ్రాన్ చెప్పారు. తాజాగా ఇమ్రాన్ దంపతులపై తోషఖానా కేసును ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది.

తన భార్యపై విషప్రయోగం జరగడంతో ఆమె శరీరంపైన, నాలుకపైన మచ్చలు ఏర్పడ్డాయని, దీని వెనుక  ఎవరున్నారో తనకు తెలుసునని ఇమ్రాన్ అన్నారు. ‘నా భార్య బుష్రాకు ఏదైనా జరిగితే, అందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ బాధ్యత వహించాలి’ అని చెప్పారు. తన భార్యకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ అసిమ్ పైనా తమకు నమ్మకం లేదన్నారు.

బుష్రా బీబీ మాట్లాడుతూ తనకు రోజూ ఇచ్చే ఆహారంలో మూడు చుక్కలు టాయిలెట్ క్లీనర్ ను కలిపేవారని, దీనివల్ల తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ఈ విషయాన్ని జైలులోనే ఉన్న కొందరు తనకు చెప్పారని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News