Wednesday, January 22, 2025

స్పీకర్ పోచారంను కలిసిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ

- Advertisement -
- Advertisement -

Business Advisory Committee met Speaker Pocharam

హైదరాబాద్: అసెంబ్లీ భవనంలోని స్పీకర్ చాంబర్ లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో బిజినెస్ అడ్వైజరీ కమిటీ  మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసభాపతి టి.పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సెప్టెంబర్ 16 నుండి 3 రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైఖ్యత ఉత్సవాలు ఉన్నందున సెప్టెంబర్ 12,13 తేదీలలో శాసనసభ నిర్వహించాలని అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News