Monday, December 23, 2024

దోపిడీ వ్యాపారం…

- Advertisement -
- Advertisement -

ఇతర ప్రాంతాల నుంచి ‘జీరో’గా జిల్లా కేంద్రానికి పలు వస్తువులు..8అక్కడ చవగ్గా తీసుకొచ్చి.. ఇక్కడ రెట్టింపు ధరకు విక్రయాలు

ఎమ్మార్పీకి మంగళం, అమ్మకందారు చెప్పిన రేటే ఫిక్స్ , బిల్లులివ్వకుండా బురిడీ
కొట్టిస్తున్న వ్యాపారులు, రెడీమేడ్ దుస్తుల నుంచి ఎలక్ట్రికల్ సామగ్రి వరకు అంతటా దోపిడీనే..
చోద్యంచూస్తున్న పన్నుల శాఖ అధికారులు

Business fraud in Yadadri bhongir

మనతెలంగాణ/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు దుకాణాల్లో వ్యాపారం దోపిడీగా మారిపోయింది. ఇ ష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తూ జిల్లా ప్రజలను దోపిడీ చే స్తున్నారు. ప్రతి వస్తువు మీదా అధిక లాభం ఉండాల్సిందే. కొనుగోలుదారుడు ఎంత తక్కువకు అడిగినా తనకు రెట్టింపు లాభాపేక్ష లే కుండా అమ్మే పరిస్థితి లేదు. దూరప్రాంతాల నుంచి హోల్‌సేల్ ధరలకు తీసుకొచ్చే వ్యాపారులు వినియోగదారులను బాగానే బురిడీ కొ ట్టిస్తారు. ఏ వస్తువు ఎంత ధరకు విక్రయిస్తున్నామో ముందుగా చె ప్పని వ్యాపారులు అమ్మకాల విషయాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీపీ)కి మ ంగళం పలుకుతున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నా యి. ఐదు శాతం మినహా మిగిలిన దుకాణాల్లో ఎక్కడా ధరలను సూ చించే బోర్డులు కనిపించడం లేదు. కిరాణా సరుకుల్లో కిలోకు రూ.5 నుంచి రూ.10 తేడా చూపిస్తుండగా ఫ్లైవుడ్ సామాన్ల విషయంలో వేల వరకు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారు నిర్ణయించిన ధరలకే ప్రజలకు విక్రయించేస్తున్నారు.
ఎక్కువగా వాటిపైనే….
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వచ్చే సరుకంతా పెద్ద మొత్తంలో చవక ధ రలకు తీసుకొచ్చేదే. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, గుజరాతలోని పలు నగరాల నుంచి తరలించేస్తుంటారు. జీరో వ్యాపారం చేసి ప్రభుత్వాదాయానికి గండి కొట్టే వ్యాపారులు ఇక్కడ అధిక ధరలకు విక్రయించి, ప్రజలను బురిడీ కొట్టించేస్తున్నారు. జిల్లాలో రెడీమేడ్ దుస్తుల విషయంలోనే ఎక్కువగా జీరో వ్యాపారం సాగుతోంది. అ క్కడ రూ.300 పడే దుస్తులను ఇక్కడ రూ.600 నుంచి రూ.800కిపైగా విక్రయిస్తున్నారు. ఏ వస్త్ర దుకాణంలోనూ ఎమ్మార్పీకి విక్రయి ంచరంటే ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎమ్మార్పీ స్టిక్కర్లు కూడా దుకాణదారులు అతికిస్తారంటే ఏస్థాయిలో దోపిడీ జ రుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇళ్ల నిర్మాణాల విషయంలో ఉడ్‌వర్క్ ఎక్కువగా చేయిస్తున్నారు. ఫ్లైవుడ్స్ దుకాణాల్లో భారీగా జీరో వ్యాపారం సాగుతోందనేది సుస్పష్టం. ట్యాప్ నుంచి డోర్ వరకు ప్రతి వస్తువులోనూ ఎమ్మార్పీ ఎక్కడా కనిపించదు. ఇక ఐరనమార్ట్‌లలో మరింత గందరగోళం. రేకుల నుంచి ఇనుప కడ్డీల వరకు వివిధ రూపాల్లో వస్తువుల విషయంలో భారీగానే మార్జిన ఉంటుందని సమాచారం. మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రికల్, ఎలక్రానిక్స్ వస్తువుల్లోనూ ఇదే పరిస్థితి. వీటిని స్మగుల్ గూడ్స్ తరహాలో తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. వాటిపై ధర స్టిక్కర్లు కూడా కనిపించకపోవడం గమనార్హం. ఎక్కువ రేటు చెప్పడం, వినియోగదారుడు తా ను భావించిన ధరకు దిగొచ్చాక విక్రయించడం జరుగుతోంది. గ్రా నైట్ మార్బుల్స్‌లో సైతం రేట్లలో తేడా ఉంటోందనే ఆరోపణలున్నాయు.
సిగరెట్ల విక్రయాల్లో భారీ దోపిడీ
ఇష్టమొచ్చినట్లు సిగరెట్లు విక్రయిస్తూ ధూమపాన ప్రియుల జేబులు గుళ్ల చేస్తున్నారు. సిగరెట్ అమ్మకాలు భారీగా జరుగుతుంటాయి. చై నస్మోకర్లు రోజుకు రెండు నుంచి మూడు ప్యాక్‌ల (20 నుంచి 30) సిగరెట్లు ఊదేస్తుంటారు. పొగ అలవాటు ఉన్న ప్రతి వ్యక్తి కనీసం రో జులో ఐదు సిగరైట్లయినా తాగేస్తాడు. ఆ మేరకు జిల్లాలో రోజుకు 5 లక్షలుపైగా సిగరెట్లు కాల్చేస్తారనేది అంచనా. కింగ్‌సైజ్ గోల్డ్‌ఫ్యాక్ (10 సిగరెట్ల ప్యాక్) టీస్టాళ్లు, దుకాణాలకు రూ.152కి విక్రయిస్తారు. వారు వినియోగదారుడికి భారీ తేడాతో విక్రయిస్తారు. వారికి ఒక్కో సిగరెట్ రూ.15తో అందితే పొగరాయుళ్లకు రూ.20కి విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల రూ.19కి ఇస్తున్నారు. ఇలా అన్ని రకాలకు చె ందిన ఒక్కో సిగరెట్‌పైనా అదనంగా రూ.4 నుంచి రూ.5 వసూలు చే స్తున్నారు. ఒక్కో సిగరెట్‌పై రూ.2 నుంచి రూ.3 అదనపు భారంగా అనుకుంటే నిత్యం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలుపైగా టోకరా వేస్తున్నారనేది సుస్పష్టం. దుకాణాలు, టీకేఫ్‌లకు సిగరెట్లు అందజేసే సబ్‌డీలర్లు సిగరెట్ ప్యాక్‌పైనే ఏది ఎంత ధరో రాసి ఇచ్చేస్తారు. బిల్లులు ఇవ్వకుండా జరిగే ఈ మోసాలను పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు ఆమ్యామ్యాల మత్తులో తేలుతున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మరికొందరు అధికారులు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
బిల్లులేవీ…?
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలులోకి వచ్చాక ప్రతి రూ.200 పైగా విలువైన వస్తువులు కొనుగోలు చేసిన వారికి బిల్లు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిబంధన పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. మెడికల్ షాపులు, పెద్ద పెద్ద మాల్స్, మరికొన్ని వ్యాపార సముదాయాల్లో మాత్రమే బిల్లులు ఇస్తున్నారు. అధిక మంది మరాఠీ వ్యాపారులు కేవలం చిత్తుకాగితాలను తలపించే చీటీ పేపర్లలో వస్తువుల ధరలు వేసి, పంపుతారు. ఎలక్ట్రికల్, ప్లాస్టిక్ సామాన్లు, గ్రానైట్ బండలు, ఇనుముకు సంబంధించిన సామగ్రి అమ్మకాల విషయంలో భారీ గోల్‌మాల్ జరుగుతోందనే విమర్శలున్నాయు. వాటి కనీస ధర తెలియకపోవడంతో వినియోగదారులు సులువుగానే మోసపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఎమ్మార్పీకి సంబంధించి దుకాణదారులు చెప్పిందే వేదంగా తయారైంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News