Thursday, January 9, 2025

నటి హనీరోజ్‌కు వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హనీరోజ్‌పై ఓ వ్యాపారవేత్త వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ హనీరోజ్ ఆదివారం కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దాదాపు 30 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వయనాడ్‌లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News